ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభాల స్వీకరణకు
మొగ్గు చూపడంతో షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ 11,800 మార్క్ ను కోల్పోయింది. సెన్సెక్స్ 383 పాయింట్లు దిగజారి 38,970 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో 11,709 వద్ద స్టాక్ మార్కెట్లు ముగిశాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.69.72 వద్ద కొనసాగుతోంది.