దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు
సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 37,179 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,187 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఫార్మా రంగంలో దిగ్గజమైన లూపిన్ షేర్లు 4 శాతం కుంగిపోయాయి. చైనా టెలికాం దిగ్గజమైన హువాయిపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించడంతో వాణిజ్య యుద్ధం మరో అడుగు ముందుకు పడింది. ఏదేమైనప్పటికీ స్టాక్ మార్కెట్లు కాస్త లాభాలతో ప్రారంభమవ్వడంతో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది.