కొంతకాలంగా టీంఇండియాలో చోటు కోసం తపిస్తున్న యువరాజ్ సింగ్ వేరే మార్గాలను ఎంచుకుంటున్నాడు. క్రికెట్ పైనే దృష్టిసారిస్తూనే..వేరే వ్యాపకం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే బ్యూటీ, విధ్య, లాజిస్టిక్ వంటి రాంగాల్లో పెట్టుబడి పెట్టి వాటిని రన్ చేస్తున్నాడు.
తాజాగా ఓ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు యువీ. యువీ దృష్టి విమానా యానంపై పడింది, ప్రయివేటు జెట్స్ అండ్ హెలికాప్టర్ సేవలందిస్తున్న జెట్ సెట్ గో సంస్థలో ఆయన నిర్వహిస్తున్న యూ వియ్ కెన్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. జెట్ సెట్ గో సంస్థ హైఎండ్ కస్టమర్ల ప్రయాణ అవసరాలు తీరుస్తూ, వారికి ఆన్ లైన్ ద్వారా ప్రైవేటు జెట్ విమానాలను అద్దెకిస్తోంది. ఈ విభాగంలో మంచి వ్యాపార వృద్ధిని అంచనా వేసి పెట్టుబడులు పెట్టాడు.యువీ ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాడు అనేది వెల్లడించకపోయినా.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో లాభాల్లో నడుస్తోంది.
టీంఇండియాలో కి రీ ఎంట్రి ఇవ్వాలని కోరుకుంటున్న యువరాజ్ కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ లోనూ యువీకి చోటు దక్కలేదు. ఐపీఎల్లో ఢిల్లీ తరుపున ఆడినా... పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో టీంఇండియాలో చోటు సంపాదించుకోవాలనున్న ఆశలకు గండిపడింది.
ప్రస్తుతం వన్డే జట్టులో తీవ్ర పోటీ ఉంది. రాయుడు, రహానే, రోహిత్ బాగా ఆడుతున్నారు. వీళ్లు రాణించకపోయినా... ఉతప్ప, మనీష్ పాండే, కేదార్ జాదవ్ లు రెడీగా ఉన్నారు. ఇక యువీ టీంఇండియాలోకి రావడం కష్టమే అని చెప్పాలి. మొన్న జింబాబ్వే టూర్ కు కూడా యువీని ఎంపిక చేయలేదు. చూస్తుంటే...యువీ ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది.