ఉల్లి ధర మళ్ళీ మండుతుంది. కొనకముందే జేబుకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒక్క సారిగా ఉల్లి ధర పెరగటంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు.బహిరంగమార్కెట్ లో అయితే ఉల్లి ధరను వ్యాపారులు అమాంతం పెంచేశారు.
ఉల్లి ధర వల్ల ప్రభుత్వమే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతన్న ఉల్లి ధరలపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కధనం. దిగుమతి తగ్గటంతో జంటనగరాల్లో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. దిగుమతి ఒక్కసారిగా తగ్గడం తో 20రుపాయలగా ఉన్న ఉల్లి ధర పెరిగింది. బహిరంగ మార్కెట్ లో అయితే 40 రుపాయలకు పైగా వ్యాపారులు అమ్ముతున్నారు. మరో వైపు గోదాములలో ఉన్న ఉల్లి స్టాకు రోజు రోజుకు తగ్గుతుండటం....దిగుమతులు భారీగా తగ్గిపోవటంతో ధర పెరిగింది. దీంతో ఎక్కువ మంది రైతు బజార్లలోనే ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఉల్లి ధరల్లో భారీగా మార్పులు రావడం తో ఉల్లి కి బాగా డిమాండ్ పెరిగింది.. గత కొన్ని రోజుల క్రితం మామూలుగా ఉన్న ధర కాస్తా ఇపుడు50రుపాయలకు చేరింది.ఇది రైతు బజార్లో పరిస్థితి.
బహిరంగ మార్కెట్ లో అయితే 50పై మాటే....ఉల్లి ఎక్కువ గా పండించే మహరాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాలలో వర్షాలు లేకపోవటం వల్ల జంటనగరాలకు దిగుమతి ఒక్క సరిగ్గ తగ్గింది...దీంతో ఉల్లి ధర అమాంతం పెరిగింది.మరో వైపు ఎపి లోని జిల్లాలో కూడా ఉల్లి పంట తక్కువ స్ధాయిలో సాగు చేయడం తో ఉల్లి ప్రధానంగా సాగు చేస్తున్న రాష్ర్టాల్లో సెప్టెంబర్ నాటికిగానీ హోల్‌సేల్ మార్కెట్‌లోకి సరుకు వస్తుందని, అప్పటి వరకూ ధరలు అధికంగానే ఉండే అవకాశముందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.దీంతో మరో నెలరోజుల పాటు ధర ఇంకా పెరిగే అవకాశం ఉదంటున్నారు.దీంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు.గతం లో దాదాపు 20రూపాయల లోపు లభించే ఉల్లి ఇప్పుడు అమాంతం పెరిగి కొండనెక్కి కూర్చుందని నగరవాసులు వాపోతున్నారు.