ముంబై: కొత్త రూ.20 నోటు త్వరలో మార్కెట్ లోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూపొందించిన ఆ నోటుపై ముందు వైపు మహాత్మా గాంధీ బొమ్మ, వెనుకవైపు ఎల్లోర గుహలు ఉన్నాయి. అధికారులు
నోటును కొంచెం ఆకుపచ్చ, పసుపు రంగులో నిర్మించారు. ఈ నోటు భారత సాంస్కృతిక వారసత్వానికి నిదర్శమని ఆర్బీఐ పేర్కొంది. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ నోటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలో ఉన్న రూ.20 నోటు కూడా చెలామణిలో ఉంటుందని, అందులో ఆందోళన అక్కర్లేదని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేశారు.