ఎంతో ఇష్టపడిన ఫోన్ ను కష్టపడి దాచుకున్న సొమ్ముతో కొనుక్కున్నాక ఆ ఫోన్ కాస్త పోతే ఎవరికైనా
బాధగా ఉండటం సహజం. ఆ ఫోన్ తోనే అనేక కాంటాక్ట్స్ ముడిపడి ఉంటాయి. ఆ ఫోన్ పోయిందంటే వారితో ఉన్న బంధాలన్నీ ఒక్క క్షణంలో తెగిపోతాయి. అదే ఒక మొబైల్ కంపెనీకి చెందిన ఫోన్ పోతే...ఎందుకింత బహుమతి ఇస్తామంటున్నారు..అనే కదా మీ సందేహం. అందుకు ఒక కారణం ఉంది. హువావే సబ్ బ్రాండ్ అయిన హానర్ తయారు చేసిన ఫోన్ విడుదలకు సిద్ధమవుతూ ప్రయోగదశలో ఉందట. అందుకే ఆ ప్రొటోటైప్ ఫోన్ తెచ్చి ఇచ్చిన వారికి 5000 యూరోలు (సుమారు రూ.4 లక్షలు) బహుమతిగా ఇస్తామని ట్వీట్ చేసింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఒకరు డస్సెడ్రాఫ్ నుంచి జర్మనీలోని మ్యూనిచ్ కు ప్రయాణించిన ఐసీఈ 1125 రైలులో ఏప్రిల్ 22వ తేదీన ప్రయోగాత్మక దశలో ఉన్న ఫోన్ ను పోగొట్టుకున్నారని, దానిని తిరిగి ఇచ్చిన వారికి రూ.4 లక్షలు ఇస్తామని ప్రకటించింది. బూడిద రంగులో ఉన్న ఆ ఫోన్ కు ఒక కవర్ కూడా ఉందట. అలాగే మే 21 తర్వాత ఈ ఫోన్ ను తీసుకొచ్చినా హానర్ తీసుకోనని చెప్పింది.
కాగా..మే 21వ తేదీన హానర్ సిరీస్ లో ఓ ఫోన్ ను లండన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే విడుదల చేయాల్సిన ఫోన్ ప్రస్తుతం కనిపించకుండా పోయిన ప్రొటో టైప్ కావచ్చని పలువురు భావిస్తున్నారు. అందుకే దీనికి ఇంత పెద్దమొత్తంలో నగదు బహుమతి ప్రకటించిందని టాక్.