బంగారం ధర తగ్గిందనుకునే లోపే పెరిగిపోయింది. గురువారం రూ.405 తగ్గిన బంగారం ధర శుక్రవారం పెరిగి..గోల్డ్ లవర్స్ ను షాక్ కు గురి చేసింది. శుక్రవారం బులియన్ ట్రేడింగ్ లో
10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.305 పెరిగి రూ.32,690కి చేరింది. స్థానిక బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బులియన్ ట్రేడింగ్ లో బంగారం ధర పెరిగిందట. బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి రూ.28,450కి చేరింది. వెండి నాణేల తయారీదారులు, వ్యాపారవేత్తల నుంచి వెండి దిగుమతికి డిమాండ్ ఉండటంతో వెండి ధర కూడా పెరిగినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.