వివో వి15, వి15 ప్రొ ఫోన్ల వినియోగదారులకు జియో టెలికామ్ సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో వివో క్రికెట్ ఆఫర్ కింద రూ.10వేల విలువైన బెనిఫిట్స్‌ను
ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ బెనిఫిట్ ను అందుకోవాలంటే ఆ ఫోన్ల వినియోగదారులు రూ.299తో జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుందని కండిషన్ పెట్టింది. దీంతో వారికి 3.3 టీబీ వరకు 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే పేటీఎం, బెహ్రూజ్ బిర్యానీ, ఫాసొస్, మింత్రా, ఫస్ట్‌క్రై, జూమ్ కార్, క్లియర్ ట్రిప్‌లకు చెందిన రూ.4వేల విలువైన కూపన్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయని పేర్కొంది. వాటితో పాటు మరో రూ.6వేల విలువైన జియో కూపన్లు అందులో రూ.150 విలువ చేసే 40 కూపన్లు కలిపి లభిస్తాయని తెలిపింది. దీంతో వినియోగదారులకు మొత్తం రూ.10వేల విలువైన బెనిఫిట్స్ అందుతాయని చెప్పింది.