ఎస్బీఐ బ్యాంకుకు వేల కోట్ల రుణాలను ఎగవేసి తప్పించుకు పారిపోయిన విజయ్ మాల్యా ఆస్తుల అమ్మకానికి పీఎంఎల్ఏ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాల్యాకు చెందిన సుమారు
వెయ్యి కోట్ల విలువైన షేర్లను, యునైటెడ్ బ్రెవరీస్కు చెందిన షేర్లను అమ్మేందుకు కోర్టు అనుమతి తెలిపింది. మాల్యా ఆస్తుల అమ్మకంపై స్టే ఇచ్చే శక్తి కోర్టుకు లేదని స్పెషల్ జడ్జి ఎంఎస్ అజ్మీ పేర్కొన్నారు. అయితే మంగళవారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో యునైటెడ్ బ్రెవరీస్ షేర్లు 2 శాతం మేర పెరిగాయి. 74 లక్షల షేర్లను అమ్మితే సుమారు 999 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.