కోల్కతా: ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న తొలి మ్యాచులో కోల్కతా నైట్రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత సీజన్లో
ఆఖరి మెట్టుపై బోల్తా పడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో తొలి మ్యాచ్ నుంచి గెలవాలని ఉవ్విళూరుతుంది. మ్యాచ్ 4 గంటలకు ప్రారంభం కానుంది. అయితే గాయం కారణంగా ఈ మ్యాచులో కెప్టెన్ కేన్ విలియంసన్ బరిలోకి దిగడంలేదు. అతని స్థానంలో పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు.