చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కొత్త ఫీచర్లతో
తయారు చేసిన రెడ్ మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఈ వారంలో భారత్ లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ఫోన్ రూ. 11,999 లకే అందుబాటులోకి రానుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ మొబైల్ రూ.9,999కి, 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ , 16 ఇంచుల డిస్ ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా 48+5 ఎంపీ, ప్రైమరీ కెమెరా 48 ఎంపీ..ఇలా అదరగొట్టే ఫీచర్లతో రూ.11,999కే విక్రయించనుంది షియోమీ. ఈ ఫోన్లు ఫ్లిప్ కార్డ్, ఎంఐ.కాం హోమ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.