వాషింగ్టన్: 'భారత్ ప్రపంచంలోనే అధికంగా పన్నులు విధించే దేశమంటూ' భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఎగుమతి చేస్తున్న
అనేక వస్తువులపై భారత్ 100 శాతం పన్ను విధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ భారత ఉత్పత్తులపై అమెరికా ఈ స్థాయిలో పన్నులు విధించడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ హార్లే డేవిడ్ సన్ బైక్ అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా రాజధాని వాష్టింగన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ భారత్ వెంటనే తన సుంకాలను తగ్గించాలని పరోక్ష డిమాండ్ చేశారు. లేదంటే భారత ఉత్పత్తులపై అదే స్థాయిలో అమెరికా కూడా సుంకాలు పెంచుతుందని ట్రంప్ హెచ్చరించారు.