ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా నూయీ చేరారు. ఇందుకు సంబంధించి
ఆ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. అమెజాన్ సంస్థలో ఆడిట్ విభాగంలో ఆమె సభ్యురాలిగా స్థానం దక్కించుకున్నారు. బోర్డులో మొత్తం 11 మంది డైరెక్టర్లుండగా ఇంద్ర నూయీ చేరికతో మహిళా డైరెక్టర్ల సంఖ్య ఐదుకు చేరింది.