సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై
సాయంత్రం కూడా లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా లోహ, ఇన్ఫ్రా, ఐటీ, బ్యాంక్, ఆటో, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్టాక్మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ప్రారంభం నుంచి లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి విలువ రూ.70.08 వద్ద స్థిరంగా ఉంది.