జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు
వాడుతున్న వారికోసం ఆ సంస్థ మరో రెండు దీర్ఘకాలిక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.297 (84 రోజులు కాలపరిమితి), రూ.594 (168 రోజుల కాలపరిమితి) ప్లాన్లను జియో యూజర్లకు అందుబాటులో ఉంచింది. ఈ రెండు ప్లాన్లతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 0.5 జీబీ హై స్పీడ్ డేటా, 28 రోజుల వరకూ 300 ఉచిత ఎస్ఎంఎస్ సర్వీసులు లభిస్తాయి.