స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 551 పాయింట్లు పడి 27,561 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్లు పడి 8,361 వద్ద క్లోజయింది.
నల్లధనంపై 'సిట్' చేసిన రెకమెండేషన్లతో విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపించింది. పి-నోట్లను కట్టడి చేయొచ్చని పలువురు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇన్వెస్టర్ల ఆందోళనను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం 'సిట్' రెకమెండేషన్లపై తొందరపడి నిర్ణయం తీసుకోబోమని చెప్పింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలోకి పి-నోట్ల ద్వారా నల్లధనం వస్తోందని చాలా కాలంగా అనుమానం ఉంది. అయితే పి-నోట్ల వల్ల కాదు.. తొలి త్రైమాసికం రిజల్ట్స్ బాగోలేక మార్కెట్లు పడుతున్నాయి ఎమ్ కే గ్లోబల్ అనే రీసెర్చ్ సంస్థ చెబుతోంది. అటు చైనా మార్కెట్లు మరోసారి నిట్ట నిలువుగా పడ్డాయి. షాంఘై ఇండెక్స్ ఒకే రోజు 9 శాతం పతనమైంది. ఇంటా బయటా అన్నీ ప్రతికూల సంకేతాలే కావడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బంగారాన్ని చూస్తూ స్వల్పంగా కోలుకుంది. 24 క్యారెట్ల ధర రూ.200లు పెరిగి రూ.24,930కి సమీపంలో ట్రేడవుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.23,750లుగా ఉంది.