రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. ఓ ప్రభుత్వ అధికారికి ఆర్‌బీఐ పగ్గాలు
అప్పజెప్పడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేతలు పి. చిదంబరం, కపిల్ సిబాల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్య వల్ల ఆర్బీఐ ప్రతిష్ఠ మసకబారుతోందన్నారు. పాత నోట్ల రద్దుకు బలంగా మద్దతిచ్చిన ఇద్దరు వ్యక్తులను రెండు కీలక పదవుల్లో నియమించారు. ఈ నియామకాల అర్థం ఏంటీ? 'మీ అభిప్రాయాలను మేం పట్టించుకోం.. మేం ఏం చేయాలనుకుంటామో అదే చేస్తాం’ అని మీ ప్రభుత్వం చెప్పాలనుకుంటోందా? అని చిదంబరం ట్వీటర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.