ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దింతో కియా
మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లయ్యింది. పర్యావరణ హాని లేకుండా కియో మోటార్స్ తయారు చేస్తున్న ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చట. కార్ల ఛార్జింగ్ కోసం విజయవాడ పట్టణంలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని ముఖ్య పట్టణాలు, నగరాల్లో పర్యావరణ సహిత రవాణాకు ఏపీ ప్రభుత్వం గట్టి కృషి చేస్తోంది.