సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కంపెనీ సీఈవో జాక్ డోర్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈరోజు సమావేశం అయ్యారు. ట్విట్టర్ లో ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టాల్సిన
అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ట్విట్టర్‌కు విశ్వవ్యాప్తంగానే కాకుండా భారత దేశంలో కూడా మంచి ఆదరణ ఉంది. ఫేక్ న్యూస్ దూకుడును ఆపేందుకు తీసుకున్న చర్యలను జాక్ తనకు వివరించినట్లు రాహుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ లో నకిలీ వార్తల వ్యాప్తిని, నకిలీ ప్రొఫైల్స్ ని అడ్డుకోవడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలని రాహుల్ ప్రశంసించారు. ట్విట్టర్‌లో మొత్తం 336 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అయితే ట్విట్టర్ వేదికగా జరిగే సంభాషణలు మరింత ఆరోగ్యకరంగా ప్రజెంట్ చేసేందుకు టెక్నికల్‌గా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జాక్ డోర్సీ తెలిపారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోనూ ట్విట్టర్ సీఈవో సమావేశమయ్యారు.