చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా ఒక్క ఐదు నిమిషాల్లోనే 300 కోట్ల డాలర్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించింది. వివారాలు చూస్తే... మన దగ్గర ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ ఈ-కామర్స్
సంస్థలు పండుగల సందర్భంగా ప్రకటించే భారీ ఆఫర్లకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు. అలాగే చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా కూడా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఆదివారం కూడా 24 గంటల సేల్‌ను ప్రారంభించింది. అయితే ఈ సేల్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.21744 కోట్లు) బిజినెస్ చేసిందట. ఆపిల్, షియామీలాంటి టాప్ బ్రాండ్లపై భారీ ఆఫర్లు కురిపించడంతో జనాలు ఎగబడి కొనుగోలు చేశారని సమాచారం. ఈ సేల్‌ను అలీబాబా చైర్మన్ జాక్ మానే ప్రారంభించారు. ఈ 24 గంటల సెల్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికి అవసరమయ్యే వస్తువులను అమ్మకానికి పెట్టింది అలీబాబా.