చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు... ప్రధాని మోడీ ఐదు రోజుల ముందే దీపావళి కానుక ప్రకటించారు. కేవలం 59 నిమిషాల్లోనే ఆ సంస్థలకు కోటి రూపాయాల రుణం మంజూరు
చేయబోతున్నట్లు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దత్తునిచ్చే కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం 12 విధానాలను రూపొందించిందన్నారు. అందులో భాగంగా కోటి రూపాయల రుణం తీసుకున్న చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు రెండు శాతం రిబేట్ ఇస్తున్నట్లు మోడీ చెప్పారు. ఈ విధానం వల్ల దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.