జియో మరోసారి సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8జీబీ డేటాను తన కస్టమర్లందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కస్టమర్ల జియో అకౌంట్‌లోకి
ఈ అదనపు డేటా క్రెడిట్ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 8జీబీ డేటా వినియోగదారులకు 4 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా చొప్పున వస్తుందని కంపెనీ వెల్లడించింది. జియో యూసర్లు మై జియో యాప్‌కి వెళ్లి మై ప్లాన్ ఓపెన్ చేసి అందులో సెలబ్రేషన్స్ ప్యాక్ పేరుతో 2జీబీ డేటా కనిపిస్తుంది. ఈ సెలబ్రేషన్స్ ప్యాక్ కింద ఇస్తున్న డేటాను నవంబర్ 1వ తేదీ వరకు వాడుకోవాలి. ఇంతకుముందు... రిలయన్స్ జియో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ నెలలో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8 జీబీ డేటాను వినియోగదారులందరికీ ఇచ్చిన విషయం తెలిసిందే.