ఐటీ కంపెనీల సీఈవోలు, కంపెనీల అధినేతలతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు
ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. అనంతరం ఫిన్ టెక్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. ఫిన్ టెక్ సీఎక్స్ వో రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేశ్ కూడా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేశ్ ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఐటీ కంపెనీలకు కల్పిస్తున్న సదుపాయాలూ... పలు అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తమ బ్రాంచులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మిలియన్ డాలర్ ఛాలెంజ్ కింద ఫైనల్ చేరిన పలు ఐటీ కంపెనీలు ఇక్కడి హోటల్ లో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి.