సాఫ్ట్ బ్యాంక్ తో ఒప్పందం కుదర్చుకున్న రాష్ట్రాలు, దేశాలకు మరో 25 సంవత్సరాల తరవాత సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంటు ఉచితంగా ఇస్తామని జపాన్ దిగ్గజ
కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ఛైర్మన్ మసయోషి సన్ బుధవారం వెల్లడించారు. తమ కంపెనీకి డబ్బు సమస్య కాదని, టెక్నాలజీ అంతకన్నా సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులో తమ కంపెనీ పెట్టిన పెట్టుబడి మొత్తం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) సమయంలో రిటర్న్ వస్తాయని... ఆ తరవాత తాము సమాజానికి చెల్లిస్తామని ఆయన వివరించారు. ఏడాదిలో చమురు ధరలు 20 శాతం పెరిగాయని, కాని సోలార్ విద్యుత్తు విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందన్నారు. భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇప్పటికే ఏపీలోని కర్నూలు జిల్లాలో తమ కంపెనీ 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మించిందన్నారు.