డాలర్ తో రూపాయి మారకు విలువ జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తోన్న రూపాయి.. ఈరోజు సాయంత్రానికి 1 డాలరుకి
రూ.73.10కి చేరింది. ఆదివారం సాయంత్రానికి ఒక డాలరుతో పోలిస్తే రూ.72.52 గ ఉన్న రూపాయి విలువ ఈరోజు మరింత క్షిణించి దారుణంగా పడిపోయింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, ఇరాన్‌పై అమెరికా అంక్షల అమలు దగ్గరపడుతుండడంతో క్రూడాయిల్ ధరల్లో భారీ పెరుగుదల వలన కరెన్సీ మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరిగాయి. క్రూడాయిల్ నిరంతర పెరుగుదల వల్ల కరెంట్ ఖాతా పెరిగిపోయి ఆర్థికవ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు కూడా రూపాయి మరింత పతనం కావడానికి దోహదపడవచ్చునని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.