ఏపీలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తన 4జీ సేవలను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీజీఎం పూర్ణచంద్రరావు విజయవాడలో
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. నేటి నుంచి ఏపీలో 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని నవంబర్ నాటికి రాష్ట్రంలోని 46 పట్టణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొబైల్ సేవల, విస్తరణకు రూ.168 కోట్లు కేటాయించామన్న పూర్ణచంద్రరావు... 6.3 లక్షల కొత్త వినియోగదారులు ఈ ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో చేరారని పేర్కొన్నారు.