రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దేశీయంగా
చమురు ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే తగ్గే సూచనలేవి ప్రస్తుతం కనిపించడం లేదు. నిన్న సాయంత్రం డాలరుతో పోలిస్తే రూ:71.87 వద్ద నిలిచిన రూపాయి విలువ అర్ధరాత్రి నుంచి పెరుగుతూ పోయింది. ఒక దశలో రూపాయి రూ:72.66 అందుకుని ప్రస్తుతం రూ:72.10 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రూపాయి విలువ రోజు రోజుకు క్షీణిస్తుండడంతో మదుపర్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.