యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా అమితాబ్ చౌదరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హెచ్.డీ.ఎఫ్.సీలో స్టాండర్డ్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు
నిర్వహిస్తున్నారు. ప్రస్తుత యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ పదవీకాలం పూర్తవగానే అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజు జరిగిన యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో అమితాబ్ నియామకాన్ని బ్యాంకు ప్రకటించింది. తదుపరి సమావేశంలో అమితాబ్ పేరును ఆమోదించనుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31వ తేదీ వరకు అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంక్ సీఈఓగా విధులు నిర్వర్తించనున్నారు.