డాలర్‌తో రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి విలువ సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రానికి రూ:71.50 ఆల్ టైం కనిష్టానికి
చేరింది. డాలర్‌తో రూపాయి విలువ ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. రూపాయి విలువ పది పోవడంతో క్రూడాయిల్ విలువ దారుణంగా పెరిగిపోతోంది. చమురు కంపెనీలు రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా పెంచుతున్నాయి. రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్‌బిఐ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.