బంగారం ధర ఊరిస్తోంది. ధర క్రమంగా కిందకు వస్తుండటంతో బంగారం కొనాలనుకుంటున్న వారిలో ఉత్సాహం వస్తోంది. అయితే ధర ఇంకా పడుతుందేమో.. వేచి చూద్దామనుకుంటున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇంతకూ బంగారం ధర ఎందుకిలా పడుతోంది? కొనభారతీయ మహిళలఇండియన్ మార్కెట్లోనూ భారీగా పడుతోంది. ధర ఇంకా ఎంత కిందకు వెళ్లొచ్చు? లాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
సంక్షోభానికి, బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు ఎంతగా ఉంటే బంగారం ధర అంతగా పెరుగుతుంది. 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చిన ధర బంగారం ధర బాగా పెరిగింది. ౧౦ వేల రూపాయల లోపు ఉన్న బంగారం ధర అమాంతం పెరిగి ౩0 వేల రూపాయలకు చేరింది. ఒక దశలో 35 వేల రూపాయలకు కూడా వెళ్లింది. ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత మూడేళ్లుగా 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల మధ్యలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర పెరుగుతోంది. సానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. యూరో జోన్ లోని గ్రీస్ కు బెయిల్ అవుట్ అవుట్ ప్యాకేజీ లభించడం, ఇరాన్ తో అమెరికా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. దీనికి తోడు అమెరికాలో సెప్టెంబరులో ఫెడరల్ రిజర్వ్.. వడ్డీరేటు పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండంతో బంగారాన్ని అమ్మేసుకోవడం మేలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా బంగారం ధరను బట్టి ఇండియాలో ధరలు మారుతూ ఉంటాయి. ఏడాది కిందట ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1300 డాలర్ల దగ్గర ఉండేది. అలాంటిదిప్పుడు 1120 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఔన్స్ ధర 1080 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని చాలా కాలంగా అనలిస్టులు అంచనా వేస్తూ వచ్చారు. వారి అంచనా నిజమైంది. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 50 డాలర్లు పడి 1081 డాలర్ల కనిష్ఠ స్థాయిని చూసింది. అక్కడ నుంచి కోలుకుని మళ్లీ 1115 డాలర్లకు ఎగబాగింది.
ఔన్స్ గోల్డ్ ధర పతనం కావడంతో ఇండియన్ మార్కెట్లో కూడా ధర బాగా తగ్గింది. ఈ నెల మొదట్లో 27 వేల రూపాయల పైన ట్రేడయిన ధర ప్రస్తుతం 25 వేల వద్ద ట్రేడవుతోంది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 800 రూపాయలు కోల్పోయింది. ఇవి ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు. రిటైల్ మార్కెట్ ధరల్ని గమనిస్తే.. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల ధర 25,700 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ 22 క్యారెట్ల ధర దాదాపు 24,400 రూపాయల వద్ద ఉంది.

-గుదే చంద్రశేఖర్