దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రెండు రూపాయలు, డీజిల్ పై రెండు రూపాయల చొప్పున తగ్గించారు. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
గత రెండు నెలల కాలంలో చమురు ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా చమురు ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు భారత్ లో పెట్రో ఉత్పత్తుల ధరలు నిర్ణయిస్తున్నాయి.