స్టాక్ మార్కెట్ల పతనం, ఆర్థిక అభివృద్ధి రేటు తగ్గటంతో చైనాలో లగ్జరీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. వారంరోజుల్లోనే షేర్ మార్కెట్ రెండుసార్లు కుప్పకూలటంతో దాని ప్రభావం విలాసవంతమైన కార్లపై పడింది.
ఎక్కువ ధరలు ఉన్న కార్లను కొనటానికి జనాలు ఇదివరకటిలా ఉత్సాహాన్ని చూపటం లేదని లగ్జరీ కార్ల సంస్థ బిఎండబ్ల్యూ ప్రతినిధులు తెలిపారు. కార్లను కొంటున్న అతి కొద్దిమంది డిస్కౌంట్లను అడుగుతున్నారని చెబుతున్నారు. ఒకొక్క కారుపై 10 నుంచి 15 శాతం తగ్గింపు ధర ఇవ్వకుంటే కార్లను చూడటానికి కూడా కొందరు ఇష్టపడటం లేదని చెప్పారు.