ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా..ప్రతి టికెట్ కొనుగోలుపై రూ.1,000 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎకానమీ, ఎకానమీ ప్లస్ టికెట్లపై ఈ రాయితీ ఆఫర్ వర్తించనున్నది.
ఈ ఆఫర్ 14న సాయంత్రం ఆరు గంటల లోపు బుకింగ్ చేసుకున్న టికెట్లపై ఈ తగ్గింపు లభించనున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారు వచ్చే నెల 1 నుంచి అక్టోబర్ 24 లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పది లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.