డిజిటల్ ఇండియా వారోత్సవాల సందర్భంగా... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్యులకు BSNL సేవలు అందిస్తామని... హైదరాబాద్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ దామోదరరావు అన్నారు. రాత్రి వేళలో BSNL ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్ కు... మొబైల్ నుంచి మొబైల్ కు ఉచితంగా మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. ఉచిత రోమింగ్ సౌకర్యం అందిస్తున్నామన్నారు.