గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన బలవంతపు భూ సేకరణ జీవోను
రద్దు చేయాలని లేఖలో కోరారు. అలాగే... మంగళగిరిలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఆర్కే... లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అన్నదాతల నుంచి భూములు సేకరించారని ఆరోపించారు. ఇష్టం లేకున్నా బంగారం పడే భూములను రైతులు భయంతో ఇచ్చారని చెప్పారు. గుంటూరు - విజయవాడ మధ్య ఉన్న మంగళగిరి ప్రాంతంలో తగినన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆర్కే వివరించారు. రైతుల బలవంతపు భూసేకరణ జీవో రద్దు చేయాలని లేఖలో సీఎం జగన్ కు సూచించారు.