పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమోన్మాది సుధాకర్ రెడ్డి
కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కవిటం గ్రామానికి చెందిన సుధాకర్ గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. కానీ... ఆమె సుధాకర్ ప్రేమను అంగీకరించలేదు. వాస్తవానికి అప్పటికే అతనికి పెళ్లయింది. భార్యతో విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. అయినా ప్రేమ పేరుతో యువతి వెంటపడి వెధిస్తున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన సుధాకర్ ఆమెను చంపాలనుకున్నాడు. పథకం ప్రకారం ఈరోజు ఉదయం సదరు యువతి కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుండడం గమనించాడు. ఇదే సరైన సమయమని భావించిన నిందితుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు.