నెల్లూరు: తన కుటుంబ సభ్యుల జోలికొస్తే ఉరుకునేదిలేదని, ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ రోజు ఆయన నెల్లూరులో
పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... చట్టం కొందరికి చుట్టమైతే ఇలాంటి పరిస్థితులే వస్తాయన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కుటుంబసభ్యులని, తన కుటుంబ సభ్యుల జోలికొస్తే ఖబడ్డార్ అని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతలు ఆబోతుల్లా జనం మీద పడుతున్నారని వారిని పోలీసులు కట్టడి చేయాలన్నారు. వైసీపీ దాడులపై సీఎం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని.. ఇలాగే ఉంటే వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.