విజయవాడ: వచ్చే ఏడాది జనవరి నుంచి అదనంగా మరో 7 లక్షల మందికి వైఎస్‌ఆర్ పెన్షన్లు అందచేస్తామని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెన్షనర్ల ఎంపికలో
అధికారులు సిబ్బంది అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. ఈ రోజు సెర్ఫ్ కార్యాలయంలో మంత్రి డీఆర్డీఏ పీడీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతినెలా 5వ తేదీన వైఎస్‌ఆర్ పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. డీఆర్డీఏ పీడీలు నెలలో 15 రోజుల పాటు ఫీల్డ్‌లో పనిచేయాలని ఆదేశించారు. నవరత్నాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.