గుంటూరు: సీఎం జగన్ రైతుల విషయంలో మాట మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.50 వేలు
ఒకే సారి ఇస్తానని చెప్పి, ఇప్పుడు విడతల వారిగా ఇస్తానంటున్నారని ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతు భరోసా పధకంలో నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద 10 శాతం కౌలుదారుల వివరాలు కూడా లేవని విమర్శించారు. రైతుల విషయంలో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులందరికీ అండగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కొన్ని వర్గాల రైతులకు మాత్రమే చేయుతనిస్తోందని చిక్కాల ఆగ్రహం వ్యక్తం చేశారు.