అమరావతి: వ్యవసాయ మిషన్పై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించాగారు. ఈ నెల 15 అంటే రేపటినుంచి రాష్ట్రంలో రైతు భరోసా కార్యక్రమం
అమలుకానున్న నేపథ్యంలో ఈ మేరకు సీఎం ఈ రోజు సమీక్ష జరుపుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రైతు భరోసా, మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధి, తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ భేటీకి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కన్నబాబు, ఎమ్ఎస్ స్వామినాథన్, పాలగుమ్మి సాయినాథ్, రైతు సంఘాల నేతలు తదితరులు హాజరయ్యారు.