అమరావతి: సీఎం జగన్ తో సమావేశమయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా అమరావతి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వీక్షించాలని సీఎం జగన్ను కోరనున్నారు. అలాగే... సీఎంతో కలిసి చిరంజీవి దంపతులు లంచ్ చేయనున్నాట్లు తెలుస్తోంది. కాగా... జగన్ సీఎం అయిన తరువాత టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కలవలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి, జగన్ సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.