Print
Hits: 919
vijayasai satires on chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇవాళ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన

గాజువాకలో ప్రచారానికి వెళ్లలేదట చంద్రబాబు గారు. ఆయన కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో. ఆవిధంగా తామిద్దరం పార్టనర్లమని బయట పెట్టుకున్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు. అంటూ ఎద్దేవా చేశారు.

అనంతరం మరో ట్వీట్లో మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు అని చంద్రబాబు గత వ్యాఖ్యలను గుర్తు చేశారు.

e-max.it: your social media marketing partner