టీడీపీ అధినేత చంద్రబాబు అవే అబద్ధాలు, అదే సొల్లు మాటలతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు అంటూ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎం, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్, మళ్లీ మూడోసారి అదే పోస్టు. నోస్టాల్జియాలో జీవిస్తున్నాడు. పాపం తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి పదేపదే ఈ విషయాలు జ్ణాపకం చేస్తుంటారు. దేశంలో ఓడిన, పదవిలో ఉన్న సీఎం లెవరూ ఇలా సొంత డబ్బా కొట్టుకోలేదు.
పోలవరం అంచనాలను 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచడంలో జరిగిన అవినీతిపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర జలవనరుల శాఖను విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబు స్వరం మారింది. నిరాశా నిస్పృహలు ఆవహించాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. అవే అబద్ధాలు. అదే సొల్లు.