విశాఖపట్నం: వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు తొందర్లోనే నవగ్రహాలుగా మారిపోతాయని ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ రోజు విశాఖలోని టీడీపీ
కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్నికల సమయంలో సీఎం జగన్ చేసిన వాగ్ధానాలపై ధ్వజమెత్తారు. మాట తప్పం, మడమ తిప్పం అని... ఇప్పుడు మాట తప్పడం, మడం తిప్పడం.. తప్పితే మరి ఏం కనిపించడం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ‘రావాలి ఇసుక, కావాలి కరెంట్’ అనే స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పనులు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వమని, ప్రజలు భయపడకుండా పోరాటం చేస్తే సీఎం జగన్ పులివెందుల పారిపోవడం ఖాయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.