Print
Hits: 956
chiranjeevi to meet cm jagan

అమరావతి: సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఖరారయ్యింది. రేపు ఉదయం 11 గంటలకు చిరంజీవి, సీఎం జగన్  ను కలవనున్నట్టు

సీఎంవో కార్యాలయం స్పష్టం చేసింది. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు, ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ కూడా సీఎం జగన్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. కాగా... జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనను కలవనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేసింది.

e-max.it: your social media marketing partner