ఢిల్లీ: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ‘రైతు భరోసా’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని జగన్ మోదీని
ఆహ్వానించారు. అలాగే... పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రానికి మిగిలిన నిధుల వివరాలను ప్రధానికి జగన్ తెలియజేశారు. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ఈ భేటీలో ప్రధానితో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు నిధులు, ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే... విశాఖ – కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని కూడా జగన్ మోదీకి వినతిపత్రం అందించినట్టు సమాచారం.