తూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట మండలం జి.మేడపాడులో దారుణం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో 8 మంది కార్మికులు తీవ్రంగా
గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా... ప్రమాద స్థాయి పెద్దగా ఉండడంతో గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.