అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సహా ఇతరత్రా అన్ని హిందూ దేవాలయాల్లో ఉద్యోగులుగా హిందువులు మాత్రమే
పనిచేయాలని పేర్కొంది. ఇతర మతస్తులు వేరే శాఖల్లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే... ఎవరైనా ఉద్యోగులు క్రైస్తవులు లేదా ముస్లిం ఉద్యోగుల ఇళ్ళల్లో జరిగే పండుగలు, పెళ్ళిళ్ళు ప్రార్థనలకు వెళ్లినట్లు నిరూపించే వీడియోలను విజిలెన్స్ శాఖకు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు అందిస్తే... వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని తెలిపింది. ఆ సమాచారం నిజమేనని రుజువైతే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది.