తిరుమల: దేవాదాయశాఖ చేసిన తప్పిదం టీటీడీకి ఫ్రీగ తలనొప్పి తెచ్చి పెట్టింది. ముంబైకి చెందిన రాజేష్ శర్మను ప్రభుత్వం టీటీడీలో సభ్యుడిగా అవకాశం ఇచ్చింది. అయితే
దేవాదాయ శాఖ మాత్రం పొరపాటున ముంబైకి చెందిన రాజేష్ శర్మకు బదులుగా ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు సమాచారం అందించింది. ఈ విషయం తెలియని టీటీడీ అక్టోబర్ 3న ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే... ముంబైకి చెందిన అసలు రాజేష్ శర్మ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో దేవాదాయ శాఖ తప్పిదం బయటకు వచ్చింది. దీంతో టీటీడీ అక్టోబర్ 5న ముంబైకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణస్వీకారం చేయించడానికి ఏర్పాట్లు చేసింది.
టీటీడీ ఛైర్మన్ సహా, 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 36 మందితో ప్రభుత్వం టీటీడీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ సహా... మహారాష్ట్ర, తమిళనాడు పలు రాష్ట్రాల వారిని టీటీడీలో అవకాశం ఇచ్చింది.