అమరావతి: యురేనియం డ్రిల్లింగ్ పనులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. యురేనియం తవ్వకాలను జరపడం లేదని ప్రభుత్వం అబద్దాలు
చెబుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆళ్లగడ్డ వద్ద యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేసి.. దీనికి జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే నల్లమలను కాపాడాలంటూ విప్లవ గాయని విమలక్క చేసిన ఓ పాటను కూడా జనసేనాని పోస్ట్ చేశారు. ఆ పాట స్పూర్తి వంతంగా ఉందన్నారు. ప్రజలకు అండగా, యురేనియంపై పోరాటానికి మద్దతుగా జనసేన ఉంటుందని ట్వీట్ లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.